Thursday, May 16, 2024

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయండి.. పౌర సరఫరాల చైర్మెన్ రవీందర్ సింగ్

ప్రభన్యూస్, ప్రతినిధి/యాదాద్రి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, రైతులు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని పౌరసరఫరాల చైర్మెన్ రవీందర్ సింగ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ మండలంలోని గూడూర్, జైనపల్లి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు తీరును పరిశీలించారు. రైతులు ధాన్యమును ఆరబెట్టి, తూర్పార బట్టి తీసుకు వచ్చి మద్దతు ధరను పొందాలని సూచించారు. తూకం వేసిన వడ్లను వెంటనే కేటాయించిన మిల్లులకు రవాణా చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడు టార్పలిన్లు సమకూర్చుకోవాలని జిల్లా అధికారులకు సూచించారు. జిల్లా లోని కాదంబరి రైస్ మిల్ ను సందర్శించి మిల్లర్లు తగినంత మంది హమాలీలను ఏర్పాటు చేసుకొని ధాన్యం లారీలను వెంటనే దిగుమతి చేసుకోవాలని కోరారు. రైతులు ఇబ్బంది పడవద్దని, ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. అనతరం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ గోపీ కృష్ణ, డి ఎస్ ఓ శ్రీనివాస్ రెడ్డి తో సమావేశాన్ని నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. సజావుగా జరిగేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.కలెక్టర్ పమేలా సత్పతి చైర్మెన్ రవీందర్ సింగ్ కు పూల మొక్కను అందజేయగా, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రైస్ మిల్లర్లు నాగభూషణం, మార్తా జగదీష్ లు శాలువాతో ఘనంగా సన్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement