Friday, May 31, 2024

కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన.. బీసీ కమిషన్ మెంబర్ శుభప్రద్ పటేల్

వికారాబాద్, (ప్రభ న్యూస్): ఢిల్లీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో గురువారం బీసీ కమిషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ పాల్గొన్నారు ఢిల్లీ వసంత్ విహార్ లో కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిచారు. అంతకుముందు పార్టీ నేతలతో కలిసి ఆఫీసు ఆవరణంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ జెండాను అవిష్కరించారు. అనంతరం మొదటి అంతస్థులోని తన ఛాంబర్ లోకి వెళ్లి సీటులో కూర్చున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కి రాష్ట్ర బీసీ కమిషన్ మెంబెర్ శుభప్రద్ పటేల్ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేయాలని కేసీఆర్ శుభప్రద్ పటేల్ ని భుజం తట్టి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement