Saturday, May 4, 2024

TS: మేడారం జాతరలో ప్రత్యేక పూజలు…జాతర ఆరంభం…

మేడారం జాతరలో ప్రత్యేక పూజలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మండమెలిగే పండగ పేరుతో నిర్వహించే ఈ ఉత్సవంతో జాతర ఆరంభమవుతుందని పూజారులు పేర్కొన్నారు.

- Advertisement -

ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో నిర్వహించే ఈ వేడుక ఇవాళ ఉదయం నుంచి రేపు వేకువజాము వరకు కొనసాగుతుంది. మేడారంలోని సమ్మక్క దేవత పూజా మందిరం, కన్నెపల్లి సారలమ్మ గుడి, పూనుగొండ్ల, కొండాయి గ్రామాల్లో పగిడిద్దరాజు, గోవిందరాజు ఆలయాల్లో ఈ ఉత్సవాలు జరుపుతారు. కాగా, పూర్వకాలంలో ఈ గుడుల స్థానంలో గుడిసెలు ఉంటుండే.. రెండేళ్లకు ఇవి పాతబడి పోవడంతో.. పూజారులు అడవికి వెళ్లి చెట్టుకొమ్మలు, వాసాలు, గడ్డి తీసుకువచ్చి దేవుళ్లకు కొత్తగా గుడిని నిర్మించి పండగ చేసుకునే వారు. దీన్నే మండమెలిగే పండగగా పిలుస్తారు. ఇక, పూజారులందరూ ఆచారం ప్రకారం తలో పని చేసి పగలంతా మండమెలిగి, రాత్రంతా దేవతల గద్దెలపై జాగారం చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement