Saturday, May 4, 2024

NZB: నూతన అంబులెన్స్ ‌లను ప్రారంభించిన సభాపతి పోచారం

బాన్సువాడ, ఆగస్టు 17, ప్రభ న్యూస్ : ప్రజలకు వైద్యం అందించేందుకు గాను మెరుగైన రవాణా సౌకర్యం కోసం నూతనంగా అంబులెన్స్ లను శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వైద్య ఆరోగ్యశాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాల నుండి అమ్మ ఒడి పథకం ద్వారా ప్రసవంకు ముందు ప్రసవం తర్వాత నేరుగా ఇంటి దగ్గరికి చేరేవిధంగా 102 అంబులెన్స్ లు సేవలందిస్తాయన్నారు.

అదేవిధంగా 108 ప్రమాద బారిన పడిన వ్యక్తులను మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు గాను 108 ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. కానీ ఈ అంబులెన్స్ ఉపయోగపడకుండా ఉండడమే నా ఉద్దేశమని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించి ఇంటికి మంచిగా చేరుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ శ్రీనివాస ప్రసాద్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ పిట్ల శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement