Sunday, June 23, 2024

NZB: డా.మధుశేఖర్ కు మంత్రి వేముల శుభాకాంక్షలు

వేల్పూర్, ఆగస్టు 17 (ప్రభ న్యూస్) : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ ఛైర్మన్ గా డా.మధు శేఖర్ నామినేట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యరంగంలో విశేష అనుభవం కలిగిన డా.మధు శేఖర్ ను చైర్మన్ గా ఎంపిక చేయడం జరిగింది. తనను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ ఛైర్మన్ గా నామినేట్ చేసిన అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని డా.మధు శేఖర్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డా. మధు శేఖర్ కు శుభాకాంక్షలు తెలిపారు. తనకు అత్యంత అప్తుడైన డా.మధు శేఖర్ కి ప్రతిష్టాత్మక పదవి రావడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు.

ఛైర్మన్ తో సహా మొత్తం 13మందితో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ సంస్థ కార్యకలాపాలు నిర్వహించనుంది. ఈ బోర్డ్ లో హెల్త్ సెక్రటరీ వైస్ చైర్మన్ గా, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్, నిమ్స్ డైరెక్టర్ ఫైనాన్స్ సెక్రటరీ అలాగే తదితరులు సభ్యులుగా ఉంటారు. వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎం, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది కోసం శిక్షణ ఇచ్చే ఉన్నత స్థాయి సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్. ప్రత్యేక ప్రజారోగ్యం, వైద్య రంగంలో వివిధ అధ్యయనాలను చేపట్టేందుకు పరిశోధనా సంస్థగా పనిచేయనుంది. గతంలో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ చైర్మన్ గా ఉంటున్న ఇన్స్టిట్యూట్ ని కార్పొరేషన్ గా మార్చి తొలి చైర్మన్ గా డాక్టర్ మధుశేఖర్ ని ప్రభుత్వం నియమించడం జరిగిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement