Wednesday, May 1, 2024

విజయ డెయిరీలో సోలార్‌ పవర్‌ ప్లాంట్లు.. 19 చోట్ల ఏర్పాటుకు స‌న్నాహాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని విజయ డెయిరీ మరో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. తన పరిధిలో ఉన్న డెయిరీ, చిల్లింగ్‌ సెంటర్లలో సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లను నెల కొల్పాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జరిగిన బోర్డు సమావేశంలో పశుసంవర్ధక శాఖ సెక్రటరీ అనితా రాజేంద్ర, టీఎస్‌ రెడ్కో ఎండి నీలం జానయ్య ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విజయ డెయిరీలో మొత్తం 8 డెయిరీలు, 11 చిల్లింగ్‌ సెంటర్లున్నాయి. వీటి నిర్వహణకు విద్యుత్ చార్జీల కోసం అధిక మొత్తంలో ఖర్చు చేస్తుండగా, తాజాగా చార్జీలకు స్వస్తి పలుకుతూ సోలార్‌ పవర్‌ కోసం సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు నిర్ణ యం తీసుకున్నారు.

ఒప్పందంలో భాగంగా హైదరాబాద్‌ లోని ప్రధాన డెయిరీతో పాటు, జిల్లాల్లోని డెయిరీలు, చిల్లింగ్‌ సెంటర్ల లో టీఎస్‌ రెడ్కో 1930 కేవీఏ సామర్ధ్యం ఉన్న ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుతో రాష్ట్ర వ్యాప్తంగా కలుపుకుని ఏడాదికి రూ.71లక్షలు ఆదా అవుతుందని అధికారులు అంచనా. కాగా హైదరాబాద్‌ లోని లాలాపేట డెయిరీలో ప్లాంట్‌ నిర్మాణానికి ఛైర్మన్‌ లోక భూమారెడ్డి భూమిపూజ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement