Saturday, May 4, 2024

TS : పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు… భ‌యాందోళ‌న‌కు గురైన ప్రయాణీకులు…

సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్ర‌మాదానికి గురైంది. బి4 బోగీలోని బ్యాటరీలో క్యాప్ లీక్ కావడంతో పొగలు వ్యాపించాయి. దీంతో ప్ర‌యాణీకులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన రైల్వే సిబ్బంది హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వేస్టేషన్ సమీపంలో రైలును నిలిపివేసి సహాయక చర్యలు చేపట్టారు.

- Advertisement -

బి4 బోగీలోని బ్యాటరీలో క్యాప్ లీక్ కావడంతో పొగలు వస్తున్నట్లు గుర్తించిన సిబ్బంది వెంటనే మరమ్మతులు చేపట్టారు. దీంతో దాదాపు 2 గంటల పాటు రైలు నిలిచిపోవాల్సి వచ్చింది. మరమ్మతుల అనంతరం రైలు యథావిధిగా అక్కడి నుంచి వెళ్లిపోయింది.

సికింద్రాబాద్ తిరుపతి పద్మావతి ఎక్స్ప్రెస్ రోజూలాగానే స్టేషన్ నుంచి బయలు దేరింది. అందరూ నిద్రలో ఉన్నారు. అయితే B4 కోచ్ లో పొగలు రావడం మొదలయ్యాయి. రైల్వే సిబ్బంది గుర్తించి కాజీపేట రైల్వేస్టేషన్ రాగానే వెంటనే రైలును నిలిపివేశారు. కాజీపేట రైల్వే టెక్నీకల్ సిబ్బంది, అధికారులు చేరుకుని పొగలు రాకుండా వాటిని మరమ్మత్తు చేశారు. ఈ ఘటనతో కాజీపేట రైల్వేస్టేషన్ లో సుమారు గంటన్నర నిలిపివేయడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో కాసేపు ఏమీ అర్థం కాలేదు. అధికారులకు నిలదీయగా రైలులో పొగలు వ్యాపించాయని తెలుపడంతో భయాందోళనకు గురయ్యారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని మరమ్మత్తు చేసినట్లు తెలపడంతో ఊపిరిపీల్చుకున్నారు. అయితే రైలులో పొగలు వ్యాపించడానికి గల కారణం బ్యాటరీ క్యాప్ లీక్ అవడంతో ఈఘటన తలెత్తిందని రైల్వే సిబ్బంది తెలిపారు. మరమ్మత్తు అనంతరం కాజీపేట నుంచి బయలు దేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement