Monday, May 6, 2024

TS: అదిలాబాద్ జిల్లాలో బిఆర్ఎస్ కు షాక్… జ‌డ్పీ ఛైర్మ‌న్ రాథోడ్ జ‌నార్ధ‌న్ రాజీనామా

ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి పార్టీకి రాజీనామా చేయగా…నేడు ఆ పార్టీ ఆదిలాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్‌తో పాటు జైనథ్ మండల జడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి సైతం పార్టీకి రాజీనామా చేశారు.

అనంత‌రం వారు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డిని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజా భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. తాము కాంగ్రెస్ లో చేర‌నున్న‌ట్లు చెప్పారు.. ఇక కాంగ్రెస్ పార్టీలోనే జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి సీతక్క ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ కండువా వేసుకోనున్నారు. ఇందుకు నేతలు హైదరాబాద్‌కు బయలుదేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement