Friday, May 17, 2024

డ‌బుల్ బెడ్ రూం నిర్మాణంలో అక్ర‌మాలు – ష‌బ్బీర్ అలీ రాస్తారోకో

కామారెడ్డి – డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని. నిర్మాణాల్లో నాణ్యత లోపం ఉన్నాయని షబ్బీర్ అలీ ఆరోపించారు. అయితే షబ్బీర్ అలీ చేసిన ఆరోపణలో నిజం లేదని 50 సంవత్సరాలు దాటినా డబల్ బెడ్ రూమ్ ఇళ్లకు ఎలాంటి ప్రమాదం జరగదని సోమవారం చర్చకు రావాలని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ షబ్బీర్ అలీ కి సవాల్ విసిరారు. సవాల్ స్వీకరించిన షబ్బీర్ అలీ సోమవారం చర్చకు వెళ్లడం జరిగింది. అయితే స‌వాల్ చేసిన ఎమ్మెల్యే గంప గోవ‌ర్ధ‌న్ రాక‌పోవ‌డంతో ష‌బ్బీర్ డబల్ బెడ్ రూమ్ ఇళ్లను మీడియా బృందంతో కలిసి పరిశీలించారు. ఇల్లు మంజూరైనా వారు డబల్ బెడ్ రూమ్ లో నివసించడానికి బయపడుతున్నారు. చేత్తో కొడితే గోడలు ఊగుతున్నాయి, గోడలో పగుళ్ళు ప్రజలు బయపడుతున్నారని షబ్బీర్ అలీ ఆవేదన వ్యక్తం చేసారు. వెంటనే ఈ డబల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే కులగొట్టే కాంట్రాక్టర్ దగరి నుండి డబ్బులు రికవరీ చేయాలనీ ప్రభుత్వాని డిమాండ్ చేసారు. అనంతరం రాస్తోరోకో నిర్వహించి ప్రభుత్వానికి ఎమ్మెల్యే కి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు మద్ది చంద్రకాంత్ రెడ్డి, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, కామారెడ్డి మండల అధ్యక్షులు గూడెం శ్రీనివాస్ రెడ్డి, ఎస్టి సెల్ జిల్లా అధ్యక్షులు నౌసిలాల్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు శ్రీను, ఎన్.ఆర్.ఐ సెల్ జిల్లా కన్వీనర్ సుధాకర్ రెడ్డి సీనియర్ నాయకులు అశోక్,పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, బీబీపేట్ మండల అధ్యక్షులు రమేష్, దోమకొండ మండల అధ్యక్షులు అనంత్v రెడ్డి,యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుడుగుల శ్రీను, మున్సిపల్ కౌన్సిలర్ శివ కృష్ణమూర్తి, పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షులు సిరాజ్, రవి పటేల్, చందు, రాజశేఖర్, సర్వర్, దత్తెశ్వరి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement