Friday, September 6, 2024

TS: ఎంపికైన‌ కానిస్టేబుల్స్….. 21 నుంచి ట్రైనింగ్….

తెలంగాణ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగులకు ట్రైనింగ్‌ కు మహుర్తం ఫిక్స్‌ అయింది. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగులకు ఎంపికైన వారికి ఈనెల 21 నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 13,444 మంది అభ్యర్థులు ఉన్నారు. సరిపడా వసతులు లేకపోవడంతో టీఎస్ఎస్పీ విభాగానికి చెందిన 5,010 మందికి ట్రైనింగ్ ను వాయిదా వేశారు. వీరి కోసం ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో కేంద్రాలను అన్వేషిస్తున్నారు. ఒకవేళ అక్కడ కేంద్రాలు కుదరకపోతే టీఎస్ఎస్పి కానిస్టేబుళ్లు మరికొన్ని నెలలు వేచి చూడాల్సిరావొచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement