Sunday, April 14, 2024

TS: క‌రీంన‌గ‌ర్ శిశువు కిడ్నాప్ కథ సుఖాంతం… నిందితుల అరెస్ట్…

మాతా శిశు కేంద్రంలో ఆదివారం రోజు మధ్యాహ్నం జరిగిన జరిగిన ఆడ శిశువు కిడ్నాప్ కథ సుఖాంతమైంది.
కరీంనగర్ టౌన్ ఏసీబపీ కార్యాలయంలో సోమవారం ఉదయం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కరీంనగర్ టౌన్ ఏసిపి న‌రేంద‌ర్ మాట్లాడుతూ, ప్రకారం పెద్దపల్లి జిల్లా తక్కలపల్లి గ్రామానికి చెందిన బొమ్మ అలియాస్ ముక్కెర కవిత అలియాస్ పద్మ గత కొంతకాలంగా పిల్లలు కావాలని తిరుగుతూ పరిచయం ఉన్న జమ్మికుంట లోని డి హెచ్ ఎం ఎస్ ఎర్రమరాజు జగ్గంరాజు వద్దకు వెళ్లింద‌న్నారు.

- Advertisement -

అతడు చేసిన సూచన మేరకు మాత శిశు కేంద్రం నుంచి శిశువును అపహరించినట్లు విచారణలో తెలీందని వెల్లడించారు. సిసి కెమెరాల విజువ‌ల్స్ ఆధారంగా నిందితుల‌ను అరెస్ట్ చేశామ‌న్నారు. అనంతరం శిశువును ఆస్పత్రి వైద్యుల సమక్షంలో తండ్రికి అప్పగించారు 12 గంటలలోపు కేసును చేదించిన పోలీసులను సిపి అభినందించారని ఎసిపి తెలిపారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ సీఐ వెంకటేష్, జమ్మికుంట సిఐ రవి, ఎస్బీ సిఐ సృజన్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కిరణ్ రెడ్డి, టూ టౌన్ ఎస్ఐ శేఖర్, టూ టౌన్ కానిస్టేబుళ్లు జ్ఞానేశ్వర్, మల్లయ్య లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement