Wednesday, October 9, 2024

TS | 28, 29 తేదీల్లో ఎంఎంటీఎస్​ స్పెషల్ రైళ్లు.. రద్దీకి తగ్గట్టు రైల్వే చర్యలు!

హైదరాబాద్​లో గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 28, 29 తేదీల్లో సిటీలోని వివిధ ప్రాంతాల మధ్య ఎనిమిది MMTS ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్- లింగంపల్లి (GHL-5), సికింద్రాబాద్ – హైదరాబాద్ (GSH-1) సెప్టెంబర్ 28 న నడుస్తుందన్నారు.

అదేవిధంగా.. లింగంపల్లి – ఫలక్‌నుమా (GLF-6), హైదరాబాద్ – లింగంపల్లి (GHL- 2), లింగంపల్లి – హైదరాబాద్ (GLH-3), ఫలక్‌నుమా – సికింద్రాబాద్ (GFS-7), హైదరాబాద్ – సికింద్రాబాద్ (GHS-4).. సికింద్రాబాద్ – హైదరాబాద్ (GSH-8) మధ్య స్పెషల్​ ఎంఎంటీఎస్​ రైళ్లను నడపనున్నారు. ఇవన్నీ సెప్టెంబర్ 29వ తేదీ వరకు నడుస్తాయని రైల్వే అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement