Sunday, May 5, 2024

పాఠశాల భవనాన్ని ప్రారంభించిన విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి…

(ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి)…/ బాలాపూర్ – రాష్ట్రవ్యాప్తంగా 8000దివ్యాంగుల బాల బాలికలకు ట్రై సైకిల్ లను పంపిణీ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు సోమవారం మీర్ పేట్ లోని యుపిఎస్ ప్రభుత్వ పాఠశాలలో మన బస్తీ- మన బడి పథకం కింద అభివృద్ధి చేసిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు. అనంత‌రం , దివ్యాంగులకు సహాయ పరికరాలను పాఠశాల విద్యా డైరెక్టర్ దేవసేన రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా డీఈవో సుఖేందర్ రావు మేయర్ దుర్గా డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కమిషనర్ వాణి ల‌తో క‌ల‌సి పంపిణి చేశారు

ఈ సందర్భంగా మంత్రి సబితా రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ ఏర్పడి తొమ్మిది సంవత్సరాలలో విద్య ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు, రాష్ట్రవ్యాప్తంగా గురుకుల ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు ఒక్కొక్క విద్యార్థికి లక్ష ఇరవై వేలు ఖర్చు పెట్టి గురుకుల పాఠశాలలో విద్య అందిస్తున్న మని తెలిపారు. ప్రైవేటు పాఠశాల కన్నా ప్రభుత్వ పాఠశాలలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంగ్లీష్ మీడియం కూడా ప్రారంభించినట్లు పేర్కొన్నారు. నెలకు ఒక్కసారైనా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. తల్లిదండ్రులను తీసుకొచ్చే బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్,కాలేజీలు నడుస్తున్నాయని తెలిపారు అంతేకాకుండా మెడికల్ కాలేజి కూడా కందుకూరులో పెట్టబోతున్నమని తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం ఎడ్యుకేషన్ హబ్ మారిందని అన్నారు. మన ఊరు మనబడి పేరుతో సీఎం కేసీఆర్ కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంఈఓ కృష్ణ డి ఈ గోపీనాథ్ ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి , గోవర్ధన్ రెడ్డి,కార్పొరేటర్స్ బొక్క రాజేందర్ రెడ్డి సిద్ధల బీరప్ప గజ్జల రామచంద్రయ్య, సిద్దల లావణ్య, బైగళ్ల బాలమణి, అనిల్ యాదవ్, నవీన్ గౌడ్ దన లక్ష్మి రాజ్ కుమార్, బిక్షపతి చారి, గ్రంథాలయ డైరెక్టర్ పంతంగి మాధవి,మాజీ సర్పంచ్ పండు గౌడ్, తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement