Sunday, May 5, 2024

TS: ఎన్నికల కోడ్ రాక‌ ముందే పథకాలు లాంచ్ చేయాలి : హరీష్ రావు

లోక్ సభ ఎన్నికల కోడ్ కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం పథకాలు లాంచ్ చేయాలని మాజీ మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. ఇవాళ హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిర్వ‌హించిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ..ఆరు గ్యారంటీలపై గైడ్ లైన్స్ లేకుండా అప్లికేషన్లను ఎలా తీసుకుంటారని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలకు ప్రిపరేషన్ మొదలు పెట్టామని చెప్పారు. ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేసే విషయంపై క్లారిటీ లేదన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల పోటీపై క్లారిటీ వచ్చిన తర్వాత త‌మ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు.

నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని.. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలన్నారు. ఎన్నికల కోడ్ వచ్చేవరకు కాలయాపన చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల కోడ్ కంటే ముందే పథకాలు అమలు చేయాలన్నారు. గత ప్రభుత్వం అప్పులు చేసిందని ఆరోపిస్తూ.. దాటవేత, కోత, ఎత్తివేతకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. ప్రజా పాలన పేరుతో ప్రోటోకాల్ తప్పుతున్నారని.. ఓడిపోయినవారి చేత రిబ్బన్ కట్టింగ్ చేయిస్తున్నారని మండిపడ్డారు. రైంతుబంధు ఎంతవరకు ఇచ్చారో వైట్ పేపర్ విడుదల చేయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement