Thursday, November 30, 2023

Schedule Change – ప్ర‌ధాని మోడీ తెలంగాణ ప‌ర్య‌ట‌న ఒక రోజు వాయిదా…

హైద‌రాబాద్ – ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 30న తెలంగాణకు రావాల్సి ఉంది. కానీ ఈ పర్యటన అక్టోబర్ 1న రానున్నారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్‌సో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. రానున్న డిసెంబర్ లోపు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి కీలక కార్యాచరణకు ఈ నెలాఖరు లోపు తుది రూపు ఇచ్చి అక్టోబర్ నెలలో ప్రధాని సహా అగ్రనేతల సభలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. అదే నెలలో అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement