Friday, October 11, 2024

ములుగు బిఆర్ఎస్ అభ్య‌ర్ధికి ఆర్థిక‌సాయం చేసిన మంత్రి స‌త్య‌వ‌తి, రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి

ములుగు : ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి గెలుపు కోసం కృషి చేస్తానని గిరిజ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ములుగు జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా కొనసాగుతున్న నాగజ్యోతి మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాసంలో మంత్రి సత్యవతిని తన చాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ తన నెల జీతాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి నాగజ్యోతి గెలుపు కోరుతూ 3లక్షల 50 వేల రూపాయల చెక్కును ప్రోత్సాహకంగా అందజేశారు. నాగజ్యోతి గెలుపు కోసం తాము వెన్నంటే ఉంటూ గెలుపు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి నెల జీతాన్ని లక్షా 50 వేల రూపాయల చెక్కును నాగజ్యోతికి అందజేశారు.

కాగా, ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2009లో టీడీపీ అభ్యర్ధిగా ములుగు నియోజకవర్గం నుంచి సీతక్క, ప్రాతినిథ్యం వహించారు.. 2014 లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంత‌రం 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీలో ఆమె కీలకంగా వ్యవహరిస్తున్నారు. ములుగు నుండి సీతక్క ను ఓడించేందుకు ములుగు జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ బడే నాగజ్యోతిని బీఆర్ఎస్ బరిలోకి దింపింది. నక్సల్స్ ఉద్యమంలో బడే ప్రభాకర్,ఆయన సతీమణి నిర్మలక్కలు పనిచేశారు. ఈ ఉద్యమంలో పనిచేస్తూనే బడే ప్రభాకర్ , నిర్మలలు మృతి చెందారు . వారి సంతానమే నాగజ్యోతి

ప్రస్తుతం బీఆర్ఎస్ లో నాగ‌జ్యోతి క్రియాశీల‌కంగా ఉంటూ ములుగులో బీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు కీలకంగా వ్యవహరిస్తున్నారు. జ‌డ్పీ ఎన్నిక‌ల‌లో ములుగు జిల్లాలోని తాడ్వాయి నుండి బీఆర్ఎస్ జడ్‌పీటీసీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ములుగు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా బీఆర్ఎస్ నాయకత్వం నాగజ్యోతిని నియమించింది. ములుగులో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ములుగులో సీతక్క ను ఓడించేందుకు బడే నాగజ్యోతిని కేసీఆర్ బరిలోకి దింపారు.సీతక్క కూడ నక్సల్స్ ఉద్యమంలో పనిచేశారు. ఈసారి అటు కాంగ్రెస్,ఇటు బిఆర్ఎస్ అభ్య‌ర్ధులిద్ద‌రూ న‌క్స‌ల్స్ నేప‌థ్యం ఉన్న‌వారే కావ‌డం విశేషం

Advertisement

తాజా వార్తలు

Advertisement