Tuesday, February 20, 2024

KNL: త్వరలో మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు.. బుగ్గన

కర్నూలు, ప్రతినిధి, ఆగస్టు 22 : కర్నూలు పట్టణంలోని జోహారాపురం దగ్గర నగరంలోని మురుగు నీటిని శుభ్రపరిచి నదిలోనికి చేరవేయుటకు దాదాపు 124 కోట్ల రూపాయలతో త్వరలో మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టిపి) ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేయబోతున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. కర్నూలు నగరంలోని లేబర్ కాలనీ (రోడ్ నంబర్ 2, వెంకటరమణ కాలనీ సమీపంలో) 16.93 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాలుష్య నియంత్రణ మండలి జోనల్ కార్యాలయం, ప్రయోగశాల నూతన భవనంను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు. కర్నూలు నగరంలోని లేబర్ కాలనీ(రోడ్ నంబర్ 2, వెంకటరమణ కాలనీ సమీపంలో) నూతనంగా నిర్మించిన ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి జోనల్ కార్యాలయం, ప్రయోగశాల నూతన భవనంను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రెటరీ శ్రీధర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కర్నూలు నగరపాలక సంస్థ కర్నూలు నగరంలోని లేబర్ కాలనీ(రోడ్ నంబర్ 2, వెంకటరమణ కాలనీ సమీపంలో) 1213 చదరపు గజాల స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలికి కేటాయించగా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSPHCL) వారి పర్యవేక్షణలో సొంత నిధులను సమకూర్చుకుని పూర్తి చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ద వహించి మార్పులు తీసుకుని వచ్చారన్నారు. భవనానికి డాక్టర్ వైఎస్సార్ పర్యావరణ భవనంగా నామకరణం చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాలుష్య కారక వ్యర్థాల నియంత్రణలో భాగంగా చర్యలు చేపట్టడం జరుగుతోందని, ఎక్కడా కాలుష్యం లేకుండా కాలుష్య నియంత్రణ మండలి ద్వారా అనేక చర్యలు చేపడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నదని, వాటిలో ఆధునిక టెక్నాలజీ అమలుతో కాలుష్యం తక్కువగా ఉండేలా చూడాలని, ఆ విధంగా పని చేసేలా కాలుష్య నియంత్రణ మండలి రెడ్, ఆరంజ్, గ్రీన్ కేటగిరీ వారీగా చర్యలు చేపడుతోందన్నారు. నియమాలు అధిగమిస్తే వెంటనే చర్యలు చేపడుతున్నామన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే అభివృద్ధిలో భాగంగా పరిశ్రమలు ఎంతో అవసరమని ఆ పరిశ్రమలలో కాలుష్యాన్ని నియంత్రించడం ముఖ్యమైన బాధ్యత అన్నారు.

అనంతరం కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్, కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రెటరీ శ్రీధర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్, నగర మేయర్ బి.వై.రామయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, ఏపీఐఐసీ స్టేట్ డైరెక్టర్ డాక్టర్ ఎం.గోవిందరాజు,ఆంధ్ర ప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఫెడరేషన్ అధ్యక్షులు రామలింగారెడ్డి. జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ కెవి రావు, సీనియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రాజశేఖర్, ఈఈ ముని ప్రసాద్, సిబ్బంది గణేష్, వివిధ పారిశ్రామిక ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement