Saturday, April 13, 2024

TS | రేపు సంత్ సేవాలాల్ జయంతి.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం

రేపు బంజారాల ఆరాధ్యుడు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి. ఆయన జయంతిని బంజారా కమ్యూనిటీ ఘనంగా జరుపుకుంటుంది. దీంతో ఆయన జయంతిని పురస్కరించుకుని ఫిబ్రవరి 15వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం శాఖల్లో పని చేస్తున్న బంజారా కమ్యూనిటీ ఉద్యోగులు అందరికీ ఈ సెలవు వర్తించనుంది.

సంత్ సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15వ తేదీన అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని సేవాగఢ్‌లో జన్మించారని చెబుతారు. ఆయన ఆధ్యాత్మిక గురువు, సంఘసంస్కర్త. నిజాం, మైసూరు పాలకు దారుణాలకు వ్యతిరేకంగా బంజారాల హక్కుల కోసం సంత్ సేవాలాల్ వీరోచితంగా పోరాడారు. ఆంగ్లేయులు, ముస్లిం పాలకుల ప్రలోభాలు, ఇన్‌ఫ్లుయెన్స్‌లకు లొంగకుండా బంజారాలు మతం మారకుండా ఎంతో కృషి చేశారని చెబుతారు. లిపి లేని బంజారాల భాషకు ఒక రీతిని తీసుకువచ్చింది కూడా సేవాలాలే అని పేర్కొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement