Monday, April 29, 2024

UAE – అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించిన మోడీ

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ) అబుదాబిలో నిర్మించిన మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దాదాపు ₹.700 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయం మధ్యప్రాచ్యం, యూఏఈలోని హిందూ జనాభాకు అతి ముఖ్యమైనది.

27 ఎకరాల విస్తీర్ణంలో 108 అడుగుల ఎత్తైన ఈ ఆలయం మధ్యప్రాచ్యంలో అతిపెద్ద హిందూ దేవాలయం కానుంది. 2015లో యూఏఈ రాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అబు మ్రీఖా దేవాలయం కోసం 13.5 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. 2019లో మరో 13.5 ఎకరాల భూమిని విరాళం ఇవ్వగా.. ఆలయ నిర్మాణం ఘనంగా ప్రారంభమైంది.

2018లో ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఆలయానికి పునాదిరాయి వేశారు. బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ (బీఏపీఎస్) ఈ ఆలయాన్ని నిర్మించింది. బుధవారం ఉదయం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ప్రారంభమైంది. .

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement