Friday, May 3, 2024

Sankarapatnam – రైస్ మిల్లుల‌లో విజిలెన్స్ త‌నిఖీలు ….

శంకరపట్నం: కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో శంకరపట్నం మండలంలో రైస్ మిల్లులలో మంగళవారం జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు తనిఖీలు నిర్వహించి రైస్ మిల్లు యజమానుల అవినీతి అక్రమాలను బట్టబయలు చేశారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ వేణుగోపాల్ మాట్లాడుతూ, మండలంలోని కేశవపట్నం శివారులో గల ఎస్ వి ఇండస్ట్రీస్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే ధాన్యాన్ని 2021/2022 బాకీ 532 క్వింటాళ్లు, 2022/2023 10760 క్వింటాళ్లు ప్రభుత్వానికి బాకీ ఉన్నారని వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం అక్రమంగా నిల్వ ఉంచిన సిఎంఆర్ , ప్రభుత్వం అందించే ఉచిత రేషన్ బియ్యం సుమారు 15 క్వింటాళ్లు నిల్వ ఉన్నాయని త‌నిఖీల‌లోవెల్ల డైంద‌ని అన్నారు.

అంబాలాపూర్ లో గల శ్రీరామ మాడ్రన్ రైస్ మిల్లును కూడ తనిఖీలు చేశామని ,తమ తనిఖీల్లో వెల్లడైన పూర్తి సమాచారాన్ని నివేదికలు తయారు చేసి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ వేణుగోపాల్ తెలిపారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ అనిల్ కుమార్, ప్రశాంత్ రావు, విజిలెన్స్ ఎన్ఫోర్మేంట్ తాసిల్దార్ దినేష్ చంద్ర ఫుడ్ ఇన్స్పెక్టర్ పట్టెం శ్రీనివాస్, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement