Monday, May 20, 2024

Banswada – పోచారంకు బైరాపూర్ గ్రామ దళితుల మద్దతు

బాన్సువాడ అక్టోబర్ 17 ప్రభా న్యూస్… బాన్సువాడ శాసనసభ నియోజకవర్గం భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి కి సంపూర్ణ మద్దతు మంగళవారం ప్రకటించారు బీర్కూరు మండలం బైరాపూర్ గ్రామానికి చెందిన 300 మంది దళితులు. దళిత సంఘం ప్రతినిధులు, సభ్యులు తమ కుటుంబాలతో సహా బాన్సువాడ లోని నివాసంలో పోచారం శ్రీనివాస రెడ్డి ని కలిసి ఏకగ్రీవ మద్దతు తీర్మానాన్ని అందజేసారు.

ఇల్లు లేని మా దళితులకు డబుల్ బెడ్ రూం ఇళ్ళను మంజూరు చేశార‌ని, దళిత వాడలోని గల్లి గల్లికి సిసి రోడ్లు వేయించార‌ని, , మురికి కాలువలు నిర్మించార‌ని ద‌ళితులు అన్నారు.. ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు ఇస్తున్నార‌ని,. బి.ఆర్.ఎస్ ప్రభుత్వం వచ్చాకనే మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో బి.ఆర్.ఎస్ గుర్తు కారు, మా అభ్యర్థి పోచారం అని సంఘం సభ్యులు తెలిపారు. తనకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన భైరాపూర్ దళిత కుటుంబాలకు ధన్యవాదాలు తెలిపిన పోచారం , భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ అందిస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement