Thursday, May 2, 2024

వేత‌నాలు చెల్లించాల‌ని కోరుతూ శానిటేషన్ సిబ్బంది రాస్తారోకో

మోత్కూర్, జూలై 13( ప్రభ న్యూస్) మోత్కూర్ మున్సిపాలిటీలో 67 మంది శానిటేషన్ కార్మికులు పనిచేస్తుండగా తమకు మే, జూన్ నెలలకు సంబంధించిన వేతనాలు ఇవ్వకపోవడంతో నిరసన తెలుపుతూ బుధవారం విధులు బహిష్కరించారు మున్సిపల్ కార్మికులు. నేటి ఉద‌యం ఏకంగా రోడ్డెక్కి నిరసన తెలిపారు. నిరసనలో భాగంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో సుమారు అరగంట పాటు రాస్తారోకో, ఆందోళన చేపట్టారు.

కేవలం మున్సిపాలిటీ పనులు చేసి వేతనాలు తీసుకుంటున్న తాము ఇతర పనులు చేసే అవకాశాలు లేకపోవడంతో కుటుంబ పోషణ కాస్త ఇబ్బందిగా మారిందని వాపోయారు .కార్మికులు విధులు బహిష్కరించడంతో మున్సిపాలిటీలో ఎక్కడికి అక్కడ మెయిన్ రోడ్డుపై చెత్తకుప్పలు, కాలనీలో డ్రైనేజీలు అధ్వానంగా మారాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే రెండు నెలల వేతనాలు కార్మికులకు అందజేయాలని డిమాండ్ చేశారు. పోలీసు సిబ్బంది తో చేరుకున్న ఎస్ ఐ శ్రీకాంత్ రెడ్డి వేతనాల కోసం మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన చేయాలి తప్ప ,రోడ్డు పై నిరసనలు చేపట్టవద్దని సర్దిచెప్పడంతో కార్మికులు ఆందోళన విరమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement