Friday, May 3, 2024

సందీప్ కిష‌న్ బ‌ర్త్ డే – ఊరు పేరు భైర‌వకోన చిత్రం ఫ‌స్ట్ లుక్

నేడు యంగ్ హీరో సందీప్ కిష‌న్ పుట్టిన‌రోజు..ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తోన్న చిత్రాల నుండి అప్ డేట్స్ వ‌స్తున్నాయి. కాగా ప్ర‌స్తుతం సందీప్ కిష‌న్ మూడు సినిమాల‌ను లైన్ లో పెట్టాడు. అందులో విఐ అనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ఒక‌టి. ప్ర‌స్తుతం ఈ చిత్ర‌ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. సందీప్ కిష‌న్‌ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ చిత్ర టైటిల్, ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. సైన్స్ ఫిక్ష‌న్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఊరు పేరు భైర‌వకోన’ అనే టైటిల్‌ను క‌న్ఫార్మ్ చేస్తూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో సందీప్‌కు జోడీగా కావ్యా థాప‌ర్, వ‌ర్ష బొల్ల‌మ్మ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. ఏకే ఎంట‌ర్టైనమెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌స్య మూవీస్ ప‌తాకంపై రాజేష్ దండ నిర్మిస్తున్నాడు. ఈ పోస్ట‌ర్‌లో సందీప్ చేతిలో మంత్ర దండంలాంటి క‌ర్ర‌ను ప‌ట్టుకుని ఎదురుగా భ‌గ భ‌గ మండే సూర్యుడు, చూట్టూ కూలిన రాళ్ళ క‌ట్ట‌డం ఏదో కొత్త లోకంలో ఉన్న‌ట్లుగా పోస్ట‌ర్‌ను క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా డిజైన్ చేసిన‌ట్లు ఉంది. ఫ‌స్ట్‌లుక్‌తోనే చిత్ర‌బృందం సినిమాపై ఆస‌క్తిని క్రియేట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement