Saturday, May 4, 2024

murder case : అప్సర హత్యకేసులో..సాయికృష్ణకు 14 రోజుల రిమాండ్

అప్సర హత్యకేసులో నిందితుడు పూజారి సాయికృష్ణకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సాయికృష్ణను రాజేంద్రనగర్ కోర్టులో హాజరు పరచగా..కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో సాయికృష్ణను చర్లపల్లి జైలుకు తరలించారు. జూన్ 22 వరకు సాయికృష్ణ రిమాండ్ లోనే ఉండనున్నాడు. ఈ కేసులో పూజారి వెంకట సాయికృష్ణపై 302, 201 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదుచేశారు.

అప్సర గర్భవతి అని నిందితుడు వెల్లడించడంతో… శవపరీక్ష నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. అదే నిజమైతే సాయికృష్ణపై మరిన్ని సెక్షన్లు విధించే అవకాశముంది. అప్సర డెడ్ బాడీకి పోస్ట్‌మార్టం ఇంకా జరగలేదు. పోస్ట్‌మార్టం ప్రక్రియకు ముందు అప్సర కుటుంబీకుల సంతకాలను సేకరించాల్సి ఉంది. అయితే జూన్ 9వ తేదీ మధ్యాహ్నం నుంచి అప్సర తల్లి ఇంట్లోనే ఉంది. అప్సర తండ్రి కాశీలో ఉండటంతో తల్లిదండ్రుల సంతకాల కోసం ఉస్మానియా వైద్యులు ఎదురు చూస్తున్నారు. ఈరోజు అప్స‌ర‌ తండ్రి కాశీ నుండి వస్తాడని పోలీసులు చెబుతున్నారు. కుటుంబీకులు సంతకం తీసుకున్న తర్వాత అప్సర భౌతికదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement