Sunday, May 12, 2024

Nagarjun Sagar: కేంద్ర బలగాల అధీనంలోకి సాగ‌ర్

నాగార్జున్ సాగ‌ర్ ను కేంద్ర‌బ‌లగాలు త‌మ ఆధీనంలో తీసుకున్నాయి. అర్ధరాత్రి సాగర్ డ్యాం మొత్తాన్ని కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ లు, డీజీపీలతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి మాట్లాడారు. కేంద్ర బలగాలు రెండు రాష్ట్రాలను అధీనంలోకి తీసుకునేందుకు అంగీకారం తెలిపాయి.

దీంతో అర్ధరాత్రికే సీఆర్పీఎఫ్ బలగాలను కేంద్రం పంపింది. సాగర్‌కు ఏపీ వైపు ఏపీ బలగాలు, తెలంగాణ వైపు ఆ రాష్ట్ర పోలీస్‌లు పహారా కాస్తున్నారు. ఇప్పటికే కేఆర్ఎంబీ సభ్యులు సాగర్‌కు చేరుకున్నారు. పరిస్థితిపై కేంద్రానికి నివేదిక అందించారు. ఏపీ ప్రభుత్వం నిబంధనలను అతిక్రమించి వ్యవహరించిందని కేఆర్ఎంబీ నివేదికను పంపించింది. ఇండెంట్ లేకుండా, కనీసం లేఖ కూడా రాయకుండా ఏపీ నీటి విడుదల చేసిందని పేర్కొంటూ నివేదిక అందించడం జరిగింది. ముందు ఏపీ ఇచ్చిన ఇండెంట్ ప్రకారం జనవరి, ఏప్రిల్‌లో 5 టీఎంసీల చొప్పున నీటి విడుదల చేయాల్సి ఉందని కేఆర్ఎంబీ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement