Sunday, February 25, 2024

Mitchell Marsh: అలాగే చేస్తా…ఆ ఫొటోలో ఎలాంటి అగౌరవం లేదు

ప్రపంచకప్‌ ట్రోఫీపై కాళ్లు పెట్ట‌డాన్ని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ సమర్థించుకున్నాడు. కప్‌ పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించలేద‌ని, మరోసారి కాళ్లు పెట్టడానికి విముఖత చూపనని తెలిపాడు. ఫైనల్లో భారత్‌పై విజయం అనంతరం ప్రపంచకప్‌ ట్రోఫీపై మార్ష్‌ కాళ్లు పెట్టిన ఫొటో దుమారం రేపింది.

దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ ఫొటోలో ఎలాంటి అగౌరవం లేదు. దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు. సామాజిక మాధ్యమాల్ని అధికంగా చూడను. అందులో నాకెలాంటి తప్పు కనబడట్లేదు. నిజాయితీగా చెప్పాలంటే మళ్లీ అలా చేయడానికి వెనుకాడను అని మార్ష్‌ తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement