Monday, May 20, 2024

Mizoram: ఈసీ కీలక ప్రకటన…ఎలక్షన్‌ కౌంటింగ్‌ తేదీ మార్పు..

మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీని కేంద్ర ఎన్నికల సంఘం మార్పు చేసింది. తెలంగాణ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలతోపాటుగా మిజోరంలోనూ డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు చేపట్టాలని ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది.

అయితే, మిజోరంలో ఆదివారం కాకుండా ఇంకేదైనా రోజు ఓట్ల లెక్కింపు జరపాలని అక్కడి ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి. దీంతో, వారి విజ్ఞాపనల్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు తేదీని డిసెంబర్‌ 4కు మార్పు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement