Sunday, May 5, 2024

రైతుబంధుకు నేటితో 5ఏళ్లు…ట్వీట్ చేసిన మంత్రి హరీశ్ రావు

రైతుబంధు పథకం ప్రవేశ పెట్టి నేటికి ఐదు సంవత్సరాలు అయిందని ట్వీట్ చేశారు మంత్రి హరీశ్ రావు. సీఎం కేసీఆర్ ఆలోచనతో ప్రారంభించిన రైతుబంధు వ్యవసాయాన్ని, పండగ చేసి రైతన్నను రాజును చేసింది. ఎకరాకు ఏడాదికి 10 వేల చొప్పున ఇప్పటి వరకు 10 విడతలలో రూ.65 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాలలో జమ చేసి, అద్భుతమైన రైతు సంక్షేమ పథకంగా దేశానికి రోల్ మోడల్ అయ్యింది. అందుకే కేసీఆర్ అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలు, ఎత్తుకున్న జాతీయ నినాదం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేస్తున్నాయి. అబ్ కీ బార్ .. కిసాన్ సర్కార్ అంటూ బి ఆర్ ఎస్ ను స్వాగతిస్తున్నాయని హరీశ్ రావు ట్వీట్ చేశారు. కాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం.. రైతుబంధు..ఈ పథకం దేశానికే ఆదర్శమని ఆయన చెప్పారు. అన్నం పెట్టే రైతు అప్పులు కాకూడదనేది ప్రభుత్వం ఆకాంక్ష అని స్పష్టం చేశారు. రైతుబంధు పథకం ద్వారా రైతులందరికీ యాసంగి, వానాకాలం సీజన్లకు కలిపి ఏడాదికి ఎకారానికి రూ.10 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తోన్న విషయం తెలిసిందే. తొలుత ఎకరానికి రూ.4 వేల చొప్పున ఇవ్వగా.. ఆ తర్వాత రూ.5 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తోన్న పీఎం కిసాన్ పథకంతో సంబంధం లేకుండా రైతుబంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం ఎంతో ఉపయోగపడుతుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement