Sunday, October 6, 2024

Breaking | స్పీడ్​గా దూసుకొచ్చి డీసీఎంను ఢీకొట్టిండు.. స్పాట్‌లో డెత్‌

హ‌న్మ‌కొండ జిల్లాలో యాక్సిడెంట్ జ‌రిగింది. హన్మకొండ జుపార్క్ ఎదుట డీసీఎం వ్యాన్ ను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న ఇవ్వాల (బుధవారం) ఉదయం జరిగింది. సంగెం మండలం మూల తండాకు చెందిన సపావట్ సుమన్ అక్కడికక్కడే చనిపోయాడు. హంటర్ రొడ్ లో బైక్ పై నుండి స్పీడ్ గా దూసుకొచ్చి డీసీఎంను ఢీకొట్టినట్టు తెలుస్తోంది. హెల్మెట్ లేకపోవడంతో తలకు గాయమై రక్తం భారీగా పోయింది. దీంతో స్పాట్ లోనే ప్రాణాలు విడిచాడు. హెల్మెట్ ఉండి ఉంటే ప్రాణాలు దక్కేవని స్థానికులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement