Tuesday, May 7, 2024

HYD: రౌడీ షీటర్ దారుణ హత్య…

ఎస్సార్ నగర్ లోని ఓ మద్యం దుకాణం వద్ద జరిగిన ఘర్షణలో గణేష్ అనే రౌడీ షీటర్ మృతిచెందాడు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్‌గా నమోదైన గణేష్ మరో వ్యక్తి సురేష్ (36) ఎస్సార్ నగర్ కమ్యూనిటీ హాల్ కూడలిలోని సోని వైన్స్ వద్ద రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు బీరు సీసాలతో పొడుచుకున్నారు.

సంఘటనలో గణేష్‌ మృతిచెందగా, సురేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో మరో ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ ఆర్ నగర్ పోలీస్ లు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement