Tuesday, April 30, 2024

TS CM: ఇవాళ తెలంగాణ ముఖ్య‌మంత్రిగా రేవంత్‌రెడ్డి ప్ర‌మాణ‌స్వీకారం

రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 1.04 గంటలకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎల్టీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. భారీ ఎత్తున చేపడుతోన్న ఈ కార్యక్రమానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

రేవంత్‌ ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్‌ అగ్రనేతలు తరలిరానున్నారు. సోనియా గాంధీ, రాహుల్‌, ప్రియాంక, ఖర్గే, కేసీ వేణుగోపాల్‌, కాంగ్రెస్‌ ఎంపీలు, ఇండియా కూటమి నేతలు, సీపీఐ నేత డి.రాజా, పలు రాష్ట్రాల సీఎంలు మమతా బెనర్జీ, నీతీశ్‌ కుమార్‌, సిద్ధరామయ్య, స్టాలిన్‌, హిమాచల్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌, జేఎంఎం నేత శిబూ సోరెన్‌, పీసీసీ చీఫ్‌లు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, 300 మంది అమరవీరుల కుటుంబాలు, మరో 250 మంది తెలంగాణ ఉద్యమకారులు, రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పీసీసీ ఆహ్వానం పంపింది. మరికొన్ని గంటల్లో జరగనున్న ఈ కార్యక్రమానికి పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement