Thursday, October 10, 2024

Traffic restrictions: ఇవాళ హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

హైద‌రాబాద్‌లోని ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ఇవాళ‌ ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఇవాళ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న సంద‌ర్భంగా వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.

ఏవైనా ఇబ్బందులు ఎదురైతే 9010203626 నంబర్‌కు ఫోన్‌ చేయాలని చెప్పారు. పబ్లిక్‌గార్డెన్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలు నాంపల్లి వైపు మళ్లింపు, ఎస్‌బీఐ గన్‌పౌండ్రి నుంచి వచ్చే వాహనాలు చాపెల్ రోడ్డు వైపు మళ్లింపు, బషీర్‌బాగ్‌ నుంచి ఎల్బీ స్డేడియం వైపు వచ్చే వాహనాలు కింగ్‌ కోఠి వైపు మళ్లింపు, ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వచ్చే వాహనాలు నాంపల్లి వైపు మళ్లించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement