Tuesday, October 8, 2024

Delhi: కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో రేవంత్, భ‌ట్టి భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు రావాల్సిన నిధులపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. రూ.4,256 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని పీయూష్ గోయల్‌ను కోరారు.

అలాగే ధాన్యం సేకరణపై రేవంత్, మల్లు భట్టిలు కేంద్రమంత్రితో చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. ఏఐసీసీ సమావేశంలో పాల్గొనడానికి ఆయన వచ్చారు. రేవంత్ రెడ్డి అంతకుముందు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement