Thursday, May 2, 2024

CM Jagan : తెలుగు ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ సంక్రాంతి శుభాకాంక్ష‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అంటేనే అచ్చ తెలుగు పండుగ అని ఆయన అన్నారు. ప్రతి గ్రామానికి శోభను తీసుకొచ్చే పండుగని… మన సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించే పండుగ అని చెప్పారు. స్వగ్రామాలకు తిరిగి వెళ్లి, తమ కుటుంబ, సాంస్కృతిక మూలాలకు విలువనిచ్చే పండుగ అని అన్నారు.

మన ప్రభుత్వం 56 నెలల్లోనే గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ, హెల్త్ క్లినిక్ లు, రైతు భరోసా కేంద్రాలు, ఇంగ్లీషు మీడియం స్కూళ్లు, బ్రాడ్ బ్యాండ్ సదుపాయంతో అక్కడే కడుతున్న డిజిటల్ లైబ్రరీలు, ప్రతి పేద సామాజిక వర్గానికి చరిత్రలో ఎన్నడూ లేనంతగా అందిన లబ్ధి… ఇవన్నీ పల్లెలు మళ్లీ కళకళలాడేందుకు ఎంతగానో ఉపయోగపడ్డాయని జగన్ తెలిపారు. నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించగలం అనే భరోసా ఇవ్వగలిగితేనే ఇంటింటా సంక్రాంతి అని నమ్మి, ఆచరిస్తున్న ప్రభుత్వంగా… రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నతెలుగు వారందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అని జగన్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement