Tuesday, April 16, 2024

Nepal – న‌దిలో ప‌డ్డ బ‌స్సు… 12 మంది దుర్మ‌ర‌ణం ..

నేపాల్‌లో బస్సు న‌దిలోకి ప‌డిన ప్ర‌మాదంలో 12 మంది ప్ర‌యాణీకులు మృత్యువాత ప‌డ్డారు.. మ‌రో 22 మంది గాయ‌ప‌డ్లారు.. మ‌ర‌ణించిన వారిలో ఇద్ద‌రు ఇండియ‌న్స్ కూడ ఉన్నారు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ‌త అర్థరాత్రి నేపాల్ గంజ్ నుంచి ఖాట్మండుకు వెళ్తున్న ప్యాసింజర్ బస్సు సెంట్రల్ వెస్ట్రన్ నేపాల్‌లోని డాంగ్ జిల్లాలో అదుపుతప్పి రాఫ్తీ నదిలోకి దూసుకెళ్లింది. దీంతో 12మంది మరణించగా.. అందులో 8మంది ప్రయాణికులను గుర్తించినట్టు తెలిపారు. అలాగే ఇద్దరు భారతీయులను బిహార్‌కు చెందిన యోగేంద్ర రామ్ (67), ఉత్తరప్రదేశ్‌కు చెందిన మునే (31)గా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement