Tuesday, May 21, 2024

Rescued | గండం గడిచింది… ఊపిరి పీల్చుకున్న మోరంచపల్లి గ్రామస్తులు

భూపాల‌ప‌ల్లి – వ‌ర‌ద‌లో చిక్కుకున్న మోర్చంప‌ల్లి గ్రామ‌స్తుల‌ను సుర‌క్షితంగా కాపాడారు అధికారులు..కాగా, రెండు మూడురోజులుగా కురుస్తున్న జడివానకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. గ్రామ శివారులో ఉన్న వాగులోకి భారీగా వరద చేరడంతో గ్రామంలోకి ముంచెత్తింది. దీంతో ఇండ్లన్నీ నీటమునిగాయి. సమాచారం అందుకున్న అధికారులు గ్రామస్తులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. వరదలపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్‌ మోరంచపల్లిలో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు హెలికాప్టర్‌ను పంపాలని సీఎస్‌ను ఆదేశించారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ మిలటరీ అధికారులతో సీఎస్‌ శాంతికుమారి సంప్రదింపులు జరిపారు. సహాయక చర్యల్లో సాధారణ హెలికాప్టర్‌ వినియోగించడం కష్టంగా మారడంతో సైన్యంతో చర్చలు జరిపారు. సైన్యం అంగీకారం తెలపడంతో ఆర్మీకి చెందిన రెండు హెలికాప్టర్లను ప్రభుత్వం మోరంచపల్లి గ్రామానికి పంపి సహాయక చర్యలు చేపట్టింది. ..

అలాగే స్థానిక సహాయక బృందాలు గ్రామానికి చేరుకొని దాదాపు 200 మంది వరకు ప్రజలను సురక్షితంగా కాపాడారు. ముంపు ప్రాంతం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతానికి బోట్ల ద్వారా తరలించారు. అక్కడి నుంచి పునరావాస కేంద్రానికి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు తరలించాయి. వ‌ర‌ద‌లో ఇంకెవరైనా చిక్కుకున్నారేమోననని సహాయక బృందాలు గాలిస్తున్నాయి. మోరంచపల్లిలో రెండు ఆర్మీ హెలికాప్టర్ల సహాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement