Monday, April 29, 2024

శరీరాన్ని చల్లబరిచే తాటి ముంజెలు..

యాచారం : వేసవికాలం వచ్చిదంటే ప్రతి ఒక్కరు ఇష్టపడి తినే వాటిలో తాటి ముంజలు ఒక్కటి. వేసవి కాలంలో లభించే తాటి ముంజలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఎండ కాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి తాటి ముంజలు ఎంతో ఉపయోగప పడుతాయి. పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడే ఈ ముంజల ద్వారా ప్రయోజనాలు ఏమిటో తె లుసుకుంటే ఎవరు కూడ వీటిని వదులుకోరు. తాటి ముంజలలో శరీరాన్ని చల్లబరిచే గుణం ఉండటం వల్ల వేసవి కాలంలో ఎండ నుంచి కాపాడుకోవడటంలో తాడి ముంజలు చాలా బాగా పని చేస్తాయని చెప్పడంలో సందేహామే లేదు. తాటి ముంజలలో విటమిన్‌ ఏ, బి, సి, ఐరన్‌ పోటాషియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తరుచు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడి ఆజీర్థి, ఎస్‌ డిటీ లాంటి సమస్యలు దూరమవుతాయి. తాటి ముంజలు శరీరాన్ని డీహైడ్రేషన్‌ బారి నుండి కాపాడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాకుండా ఇది చెడు పదార్థాలను తొలగిస్తుంది. తాటి ముంజల గుజ్జును ముఖానికి రాసుకుంటే చర్మం మరింత కాంతివతంగా అవుతుంది. కావున ప్రతి ఒక్కరు ఈ తాటి ముంజలను వేసవి కాలంలో తినాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement