Monday, June 17, 2024

RR : మోసపోవద్దు… గోసపడొద్దు…

షాద్ నగర్, అక్టోబర్ 29 (ప్రభ న్యూస్)
కాంగ్రెస్ తో 60 ఏళ్లు పడ్డ బాధలు మళ్లీ పడోద్దని, ఎంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాలని షాద్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఎన్నికల ప్రచారంలో ప్రజలను కోరారు.ఫారూక్ నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి అభ్యర్థి అంజయ్య యాదవ్ తదితర శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రదర్శన చేపట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య మాట్లాడుతూ.. తెచ్చుకున్న తెలంగాణను ఎంతో కష్టపడి బంగారు తెలంగాణ మార్చుకుందామని ఈ క్రమంలో మరింత సమయం పడుతుందని, కాబట్టి ఈసారి మళ్లీ అవకాశం ప్రజలు ఇవ్వాలని కోరారు. తెలంగాణ తెచ్చిన పార్టీని బలపరిస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణకు బాటలు పడతాయని అన్నారు. ఎమ్మెల్యేగా అంజయ్య యాదవ్ గెలుపొందిన నాటి నుండి చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు.

రూ. 68.50 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణం పనులు, అంతర్గత మురుగు కాలువలు. ఆసరా పింఛన్ ధ్వారా 343 మందికి ప్రతి నెల 7.81 లక్షల రూపాయల పంపిణీ. రైతు బంధు లబ్ధిదారులు 840 మంది, 6.91 కోట్లు. రైతు రుణమాఫీ లబ్ధిదారులు 508 మంది, 4.1 కోట్లు. రైతు భీమా లబ్ధిదారులు 10 మంది, 50 లక్షలు. కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులు 91 మంది, 91.02 లక్షలు. శ్మశానవాటిక నిర్మాణము కోసం 12.60 లక్షలు. బి.టి రోడ్ నుండి భవాని మాత టెంపుల్ వరకూ 20 లక్షలు. ఎలికట్ట నుండి కిషన్ నగర్ వరకూ 2.35 కొట్లు, 57.10 లక్షల వ్యయంతో మిషన్ భగీరథ ద్వారా 3 ట్యాంకుల నిర్మాణంతో 1703 ఇండ్లకు త్రాగునీటి సరఫరా.. మిషన్ కాకతీయ ద్వారా 14.57 లక్షలతో పులిచెర్ల కుంట చెరువు, 63.8 లక్షలతో లాడెం చెరువు, 13.21 లక్షలతో తిమ్మయ్య కుంట చెరువు, 9.66 లక్షలతో మాలకుంట చెరువు, 12.08 లక్షలతో వడ్లోనికుంట చెరువు, 9.05 లక్షలతో బాలసముద్రం, భవానీ మాత దేవాలయ అభివృది 2కోట్లు, రైతు వేదిక 22 లక్షలతో నిర్మాణము, డ్వాక్రా భవనం 20 లక్షలు ఎస్సీ కమ్యూనిటీ హల్ 45 లక్షలు, యాదవ కమ్యూనిటీ హాల్ 10 లక్షలు, ముదిరాజ్ భవనం 20 లక్షలు, గౌడ కమ్యూనిటీ హాల్ 15 లక్షలు,ఏలికట్ట నుండి మహమాద్ అలిగూడ వరకూ 20 లక్షలతో రోడ్డు కొసం అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కారుగుర్తు పార్టీకి అండగా ఉంటూ కారు గుర్తుకు ఓటు వేసి మరొక్కసారి ఆశీర్వదించాలి, అభివృద్ధిని కొనసాగిద్దామని ఈ సందర్భంగా ప్రజలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement