Saturday, October 12, 2024

TS : మహనీయుల యాదిలో రావులపల్లి…

(ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి) : చేవెళ్ళ మండలం రావులపల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ, జాతిపిత మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్ ల విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో మంత్రులు సబితారెడ్డి, మహేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, చేవెళ్ల ఎంఎల్ఏ యాదయ్య హాజరయ్యారు. రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన ఓపెన్ డ్రైనేజీని, రూ.45 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను, రూ.12 లక్షల 60 వేలతో నిర్మించిన వైకుంఠదామాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మెన్ కృష్ణారెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి, జడ్పిటిసి మాలతి కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ ప్రసాద్, సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement