Sunday, April 28, 2024

RR: శాంతి భద్రతలను కాపాడి.. సమాజాన్ని రక్షించండి.. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

షాద్ నగర్, ఆగస్టు 17 ప్రభ న్యూస్ : పోలీసులు శాంతి భద్రతలను పరిరక్షించి సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఎంతో ఉంటుందని షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. ఇటీవల పోలీస్ రిక్రూట్ మెంట్ సెలక్షన్ లో సబ్ ఇన్ స్పెక్టర్ గా ఎంపికైన పట్లోళ్ల స్వాతిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అమాయకులను ఇబ్బందులకు గురికానివ్వకుండా చూసే బాధ్యత పోలీసులదేనని అన్నారు.

మీరు కొత్తగా పోలీస్ డిపార్ట్ మెంట్ లో చేరుతున్నారని, ప్రజలకు మేలు చేసే విధంగా ప్రవర్తించాలని, మన నియోజకవర్గానికి, మన ఊరికి మంచి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొండూటి నరేందర్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇట గణేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు విశ్వం, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజన్, చక్కటి వెంకటేష్ క్కో, గుంజల్ పహడ్ సర్పంచ్ జ్యోతి హన్మంత్ రెడ్డి, స్వాతి ప్రవీణ్ రెడ్డి, సద్గుణ, బాబాయ్ లు లక్ష్మి వెంకట్ రెడ్డి లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement