Sunday, May 19, 2024

న్యాయం జరిగే వరకు పోరు ఆగదు : మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

రైతుల‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు పోరు ఆగ‌ద‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో పండించిన వరి పంటను కొనాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో చేపట్టిన మహా ధర్నాలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.వరి కంకుల చేత బట్టి మంత్రి సబితా రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్, ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అధ్యక్షతన జరుగుతున్న మహా ధర్నాలో జడ్పీ చైర్ పర్సన్ సునీత రెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, పట్నం నరేందర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, జడ్పీ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్, జిల్లాలోని ఎంపీపీలు, జడ్పీటీపీలు, మునిసిపల్, మార్కెట్, సొసైటీ ల చైర్మన్లు, పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు బంధు నేతలు, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement