Friday, May 3, 2024

RR: పంటపొలాల్లో నీరు నిలవడంతో రైతులు చర్యలు చేపట్టాలి.. వ్యవసాయాధికారిణి జ్యోతి

వికారాబాద్, సెప్టెంబర్ 7 (ప్రభ న్యూస్): ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పత్తి పంటలో ఎండు తెగులు అనేది పొలంలో నీరు అగిపోవడం వల్ల తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఈ తెగులు వ్యాపిస్తుందని వికారాబాద్ మండల వ్యవసాయాధికారిణి జ్యోతి తెలిపారు.

ఎండు తెగులు నివారణ చర్యల కోసం ఈ ఎండు తెగులును పొలంలో గమనుంచినట్లయితే కాపర్ సల్ఫేట్ 47.15% మంకోజెబ్ 30% wdg అనే మందును లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్ అనే మందును లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున వారానికి రెండు సార్లు మొక్క వేర్ల దగ్గర బాగా ఇంకెలా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగులు ఉద్రుతిని పూర్తిగా తగ్గించ్చవచ్చన్నారు. వారం రోజుల తరువాత ఫార్ములా 4 లేదా 19:19:19 లీటరు నీటికి 2.5గ్రాములు పిచికారి చేసుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement