Sunday, May 5, 2024

RR: బీఆర్ఎస్ ద్వారానే అభివృద్ధి.. ఎమ్మెల్యే ఆనంద్

వికారాబాద్, నవంబర్ 7 (ప్రభ న్యూస్): బీఆర్ఎస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని, మరోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ అన్నారు. ఇవాళ వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఆరో వార్డు కొత్తపల్లిలో నిర్వహించిన ప్రచారంలో ఎమ్మెల్యే ఆయన పాల్గొని ప్రసంగిస్తూ… వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం మెడికల్ కళాశాల ఏర్పాటు చేసిందంటే అది బీఆర్ఎస్ తోనే సాధ్యమైందన్నారు.

కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలకు మోసపోకుండా కారు గుర్తుకు ఓటు వేసి రెండోసారి ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ లంకా పుష్పతా రెడ్డి, స్థానిక కౌన్సిలర్ ప్రవళిక కృష్ణ, కౌన్సిలర్లు అనంతరెడ్డి, మాజీ మార్కెట్ రైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి గోపాల్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ గడ్డమీద పాండు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement