Monday, May 6, 2024

RR: నాడు చీకట్లు.. నేడు వెలుగులు – ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

కొత్తూరు, అక్టోబర్ 7(ప్రభ న్యూస్): నాడు ఆంధ్ర పాలకుల పాలనలో చీకట్లలో మగ్గిన తెలంగాణ ప్రాంతం… నేడు కేసీఆర్ ప్రభుత్వ పాలనలో వెలుగులు వెదజల్లుతున్నాయని షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని సిద్దాపూర్ గ్రామంలో సర్పంచ్ వడ్డే తుల్చమ్మ బాలయ్య, విద్యుత్ ఏడి రవీందర్ ఆధ్వర్యంలో శనివారం విద్యుత్ సబ్ స్టేషన్, బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం, అంతర్గత మురుగు కాల్వలు, సిసి రోడ్ల ప్రారంభం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. 70ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం 9ఏళ్లలో జరిగిందన్నారు. నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ ప్రాంతం చిమ్మ చీకట్లు అలుముకుంటాయని ఆంధ్ర పాలకులు హేళన చేశారన్నారు. నేడు ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు, వాణిజ్య వ్యాపార రంగాలకు సైతం 24 గంటల విద్యుత్ అందించిన ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు. నేడు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందన్నారు. ఆడపడుచులకు అన్నగా సీఎం కేసీఆర్ బతుకమ్మ సారెను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఎమ్మె శ్రీలత సత్యనారాయణ, డీఈ ఆపరేషన్ షాద్ నగర్ టి. యాదయ్య, డీఈ ప్రొటెక్షన్ భాస్కర్ రావు, డీఈ కన్స్ట్రక్షన్ చంద్రశేఖర్, ఏడీఈ శ్రీకాంత్, ఏడీఈ రవీందర్, ఎంపిడిఓ శరత్ చంద్రబాబు, పీఅర్ ఏఈ హేమంత్, ఏఈ సాయికృష్ణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వంకాయల నారాయణరెడ్డి, సర్పంచులు బ్యాగరి సత్తయ్య, కాట్న రాజు, చిర్ర సాయిలు, ఎంపీటీసీలు రవీందర్ రెడ్డి, డాకి, బీఆర్ఎస్ నాయకులు మెండె కృష్ణయ్య, నందిగామ సుధాకర్, శ్రీనివాస్ రెడ్డి, భీమయ్య, జైపాల్, వన్నమ్ బాలరాజు, నరేందర్ రెడ్డి, మధుసూదన్ రావు, మైసగల్ల రమేశ్, బొజ్జ శ్రీనివాస్ రెడ్డి, వడ్డే మహేష్, వడ్డే మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement