Monday, April 29, 2024

మేడ్చల్ లో మరో 50 పడకల ఆసుపత్రి : మంత్రి హరీష్ రావు

మేడ్చల్ : మేడ్చల్ మున్సిపల్ పట్టణంలో మార్చి బడ్జెట్ లో నిధులు కేటాయించి అదనంగా మరో 50 పడకల ఆసుపత్రి ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హామీ ఇచ్చారు. గురువారం మేడ్చల్ మున్సిపల్ పట్టణంలో మేడినోవా మల్టీ స్పెషాలిటీ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మేడ్చల్ మున్సిపల్ పట్టణంలో ప్రస్తుతం కొనసాగుతున్న 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కోరిక మేరకు రూ.10 కోట్లతో ఏప్రిల్ నెలలో అదనంగా మరో 50 పడకల ఎంసిహెచ్ ఆసుపత్రిని ఏర్పాటు చేసి దానికి సరిపడ సిబ్బందిని నియమిస్తామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. అంతేకాకుండా మాతాశిశు సంక్షేమ ఆసుపత్రి అనుబంధానికి చిన్న పిల్లల వైద్యం కోసం మరో 1 కోటి రూపాయల నిధులతో వార్డును ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపికా నరసింహారెడ్డి, తెరాస పార్టీ ఎమ్మెల్యే లు వివేక్, అరేకలపూడి గాంధీ, పద్మ దేవేందర్ రెడ్డి, జ‌డ్పీటీసీ శైలజా విజేందర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, స్థానిక మున్సిపల్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement