Saturday, May 4, 2024

Ramanuja Campus – నారాయ‌ణ కాలేజీ విద్యార్ది ఆత్మ‌హ‌త్య …

హైద‌రాబాద్ – విద్యార్థి ఐఐటీ ఫలితాల్లో మార్కులు వచ్చాయని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. మాదాపుర్ అయ్యప్ప సోసైటిలోని నారాయణ కాలేజీ విద్యార్థి విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. తక్కువ మార్కులు రావడంతో స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. నారాయణ కాలేజీ రామానుజన్ క్యాంపస్ లో విద్యార్థి విజయ్ ఐఐటీ లాంగ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. అయితే ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి విజయ్(17 ) స్వస్థలం శ్రీకాళహస్తికి చెందినదిగా గుర్తించారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement