Sunday, March 3, 2024

Weather Report: తెలంగాణకు వర్ష సూచన

తెలంగాణలో ఈ నెల 26 వరకు పలు‌చోట్ల తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవ‌కాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్ల‌డిం‌చింది. దక్షిణ అండ‌మాన్‌ సము‌ద్ర‌ప్రాం‌తాల్లో ఏర్ప‌డిన ఉప‌రి‌తల ఆవ‌ర్తనం సోమ‌వారం ఆగ్నేయ బంగా‌ళా‌ఖాతం వరకు కొన‌సా‌గుతూ.. సము‌ద్ర‌మ‌ట్టా‌నికి 3.1 కిలో‌మీ‌టర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్న‌దని పేర్కొ‌న్నది. దీంతో ఆకాశం మేఘా‌వృ‌తమై ఉంటుం‌దని తెలి‌పింది. గడి‌చిన 24 గంటల్లో కుమ్రంభీం ఆసి‌ఫా‌బాద్‌, రాజన్న సిరి‌సిల్ల, ఆది‌లా‌బాద్‌, నిర్మల్‌, ములుగు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో తేలి‌క‌పాటి వర్షాలు కురి‌సి‌నట్టు వాతావరణ శాఖ తెలి‌పింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement