Monday, December 4, 2023

TS: నేడు మణుగూరులో రాహుల్ పర్యటన.. భారీగా తరలివస్తున్న కాంగ్రెస్ శ్రేణులు..

మణుగూరు, నవంబర్ 17(ప్రభ న్యూస్): ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ మణుగూరు ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ మణుగూరులో గంటపాటు రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రాహుల్ గాంధీ పర్యటనకు ఉమ్మడి ఖమ్మం జిల్లాల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, మణుగూరుకు భారీగా చేరుకుంటున్నారు. రాహుల్ పర్యటనను కాంగ్రెస్ నాయకులు, ఏర్పాట్లను సర్వం సిద్దం చేశారు. గత రెండు రోజుల నుండి మణుగూరు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే కేంద్ర బలగాలు‌ కూడా మణుగూరు ప్రాంతానికి చేరుకున్నాయి. అణువు, అణువున పోలీసులు, కేంద్ర బలగాలు సంయుక్తంగా భద్రత ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

- Advertisement -
   

ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంతంలో హెలిప్యాడ్ ల్యాండింగ్ ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ వద్ద జిల్లా ఎస్పీ వినీత్ బందోబస్తును పరిశీలించారు. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఉమ్మడి డీసీసీబీ డైరెక్టర్ తుళ్ళూరు బ్రహ్మయ్య, కాంగ్రెస్ అధిష్టానం నాయకులు మణుగూరు రోడ్ షో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రాహుల్ గాంధీ పర్యటనతో పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులకు జోష్ రానుంది. మణుగూరు ప్రాంతం కాంగ్రెస్ పార్టీ జెండాలతో కళకళలాడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement