Saturday, April 27, 2024

పేద పిల్ల‌ల‌కి నాణ్య‌మైన విద్య.. కేసీఆర్ ఆశ‌యం.. స్పీక‌ర్ పోచారం

బాన్సువాడ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా ఈరోజు బీర్కూర్ మండల కేంద్రంలో జరిగిన తెలంగాణ విద్యాదినోత్సవం లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస రెడ్డి. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ…
విద్యార్ధిని, విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు, విద్యాశాఖ సిబ్బందికి విద్యా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు.రాష్ట్రంలో గత తొమ్మిది సంవత్సరాలలో జరిగిన అభివృద్ధిని వివరించడానికే ఈ ఉత్సవాలని అన్నారు. చదువుతో మనిషికి జ్ఞానం కలుగుతుంది, మంచి చెడులు తెలుస్తాయి. మంచి నడవడిక అలవాటవుతాయి. సమాజం విద్యావంతుల సమాజంగా తయారు కావాలి.నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న, నాడు పాఠశాలలో మౌళిక వసతులు లేవు. చెట్ల కింద, గుడిసెలలో చదువులు కొనసాగేవి.కాగా నేటి రోజుల్లో పేదలు మంచి స్కూళ్లలో, కాలేజీలలో చదువుకోవడానికి ఆర్ధిక స్తోమత ఉండదు. పట్టణాలలోని ధనవంతుల పిల్లలకు అందుతున్న నాణ్యమైన విద్య మారుమూల ప్రాంతాల్లోని పేదల పిల్లలకు కూడా అందాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం.విద్యావంతుడు, ఆలోచన పరుడైన ముఖ్యమంత్రి అధికారంలో ఉంటే విద్యా వ్యవస్థ మెరుగుపరచడానికి ప్రణాళికలు తయారు చేసి అమలు చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement