Tuesday, May 7, 2024

Greetings – మంత్రి పువ్వాడ బతుకమ్మ శుభాకాంక్షలు..

ఖమ్మం : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ప్రజలందరు ఆనందోత్సాహాలతో సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గా ఆకాంక్షించారు. పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని అన్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై తొమ్మిది రోజుల పాటు తీరొక్క పూలతో జరుపుకునే ఈ గొప్ప పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలందరికి బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement